గొల్లపాలెంలో తెదేపా అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం గ్రామపంచాయతీలోని గొల్లపాలెంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వల్లెపు మునుస్వామి, మరియు టిడిపి సీనియర్ నాయకులతో పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు. తెదేపా అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.