ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్ చరిత్ర సృష్టించిన జై మీనా
రిపోర్టర్: రాము
స్థలం: మధ్యప్రదేశ్
ఆసియా క్రీడల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత్‌కు మొట్టమొదటి పతకాన్ని జై మీనా ఖాయం చేశారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన 14 ఏళ్ల జై మీనా పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఒకప్పుడు క్రికెటర్ కావాలని కలలు కన్న ఆయన, అనుకోకుండా సాఫ్ట్ టెన్నిస్ వైపు వచ్చి అద్భుత విజయాలతో దేశం గర్వించదగ్గ క్రీడాకారుడిగా ఎదిగారు.