పోలీస్ స్టేషన్ వద్దే ఎండీఎంఏ నిందితురాలపై కత్తితో దాడి

రిపోర్టర్: శివ స్థలం: Kozhikode

కేరళలోని వడకర పోలీస్ స్టేషన్ సమీపంలో ఎండీఎంఏ కేసు నిందితురాలైన ఉపాధ్యాయురాలు కీర్తనపై ఆమె సహచరుడు వినీశ్ కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బెయిల్ షరతు ప్రకారం సంతకం చేసేందుకు స్టేషన్కు వచ్చిన ఆమెపై ఈ దురాఘతం జరిగిందని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన కీర్తనను కోోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.