గడ్డం పెంచినంత మాత్రాన రేవంత్ రెడ్డి కాలేరంటూ కేటీఆర్ పై సీఎం ఫైర్
రిపోర్టర్: విజయ్
స్థలం: వికారాబాద్
వికారాబాద్ జిల్లా హకీంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గడ్డం పెంచినంత మాత్రాన రేవంత్ రెడ్డి కాలేరని, పది జన్మలెత్తినా తారక రామారావుగానే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఆయన తీరు ఉందని మండిపడ్డారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలని, కేవలం బాహ్య రూపాన్ని అనుకరించడం వల్ల రాజకీయ నాయకత్వం రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పష్టం చేశారు.