'క్షుద్ర పూజల ఆరోపణలు': మహేష్, దయాకర్లపై హరీష్ పరువునష్టం
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన క్షుద్ర పూజల ఆరోపణలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. గడువులోపు క్షమాపణలు చెప్పకపోవడంతో వారిపై నాంపల్లి కోర్టులో హరీష్ రావు తరఫు న్యాయవాది పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతుండగా, నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతల తీరును హరీష్ రావు వర్గీయులు తీవ్రంగా తప్పుపడుతూ న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.