గణేష్ చతుర్థి వేళ దేశవ్యాప్తంగా రూ. 25 వేల కోట్ల వ్యాపారం
రిపోర్టర్: మహేష్
స్థలం: India
దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా సుమారు రూ.25,000 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా పండళ్లు ఏర్పాటయ్యాయని, చైనా ఉత్పత్తులను పక్కన పెట్టి దేశీయ వస్తువులకే వ్యాపారులు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది. పూజా సామగ్రి, మిఠాయిలు, క్యాటరింగ్ రంగాలకు భారీ డిమాండ్ ఏర్పడింది.