ఆదోని మున్సిపాలిటీలో సంచలనం: స్వతంత్ర అభ్యర్థి స్వప్న నాయకర్ ఘనవిజయం

రిపోర్టర్: మహేష్ స్థలం: కర్నూలు

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్ లో కర్నూలు జిల్లా ఆదోనిలో ఊహించని పరిణామం చోటుచేసుకుందని ఎన్నికల అధికారులు తెలిపారు. జనసేన టికెట్ రాకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసిన స్వప్న నాయకర్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి షాక్ ఇస్తూ దాదాపు మూడు వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఫలితం స్థానిక రాజకీయాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు.