కంఠారంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థి నాగమణి పిలుపునిచ్చారు
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలం బాలారం సెగ్మెంట్ పరిధిలోని కంఠారం గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి గాడి నాగమణి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డు మాదవి, బొడ్డు లోవకుమారి, బొడ్డు లోవ ప్రసాద్‌లతో పాటు పార్టీ సీనియర్ నాయకులు కాళ్ల వనబాబు పాల్గొని మద్దతు తెలిపారు.