'నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు': కడప జిల్లాలో రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: రాము స్థలం: Kadapa

కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర ఉన్న వ్యక్తులు, చెడు ప్రవర్తన గల వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా తప్పు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.