మధ్యప్రదేశ్ ఆయుష్ కౌన్సిలింగ్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం
రిపోర్టర్: హరి
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ లో ఆయుష్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే మొదటి విడత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన నీట్ యూజీ అభ్యర్థులు అధికారిక ఎంపీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ వెల్లడించింది. సెప్టెంబర్ 18 నుండి 22 వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుందని, సెప్టెంబర్ 23న మెరిట్ జాబితా విడుదలవుతుందని అధికారులు తెలిపారు.