త్రిశూల్ వ్యూహంతో ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో విస్తృత భద్రతా అవగాహన

రిపోర్టర్: మహేష్ స్థలం: ఎన్టీఆర్

ఎన్టీఆర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో రోడ్డు భద్రత, మహిళా భద్రత మరియు డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా త్రిశూల్ వ్యూహంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు విజయవాడ సిటీ పోలీసులు వెల్లడించారు. కమీషనర్ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, డిసిపి సరిత పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సురక్షిత రోడ్లు, మహిళల రక్షణతో పాటు మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం హెల్ప్లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు.