భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు: ఉప్పొంగుతున్న వాగులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గోధుమ, పెనగడప వాగులు ఉప్పొంగుతున్నాయని స్థానికులు తెలిపారు. బ్రిడ్జిల పైనుంచి వరద నీరు ప్రవహించడంతో కొత్తగూడెం పట్టణానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తమై ట్రాక్టర్లను అడ్డుపెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. వర్షాల కారణంగా గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు తక్షణమే స్పందించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.