బొల్లారం ఆర్మీ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో నలుగురి అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
సికింద్రాబాద్ బొల్లారం 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. రెండు నెలల క్రితం రిటైరైన మాజీ మిలిటరీ అధికారితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసై ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించి, వారి వద్ద నుంచి ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.