పూరీ జగన్నాథుని మహాప్రసాదం ధరల పెంపు: భక్తులకు తప్పని భారీ భారం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఒడిశా
పూరీ శ్రీక్షేత్రంలో మహాప్రసాదాల ధరలు పెంచక తప్పదని సువార్, మహాసువార్ సేవాయత్ల సంఘం అధ్యక్షుడు పద్మనాభ సువార్ స్పష్టం చేశారు. బియ్యం, పప్పు, నెయ్యి, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో నష్టాలు భరించే పరిస్థితి లేదని ఆయన శుక్రవారం విలేకర్లతో తెలిపారు. గతంలో వందల రూపాయలకే దొరికే ప్రసాదం ఇప్పుడు వేల రూపాయలకు చేరిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయితీ ధరల హామీ అమలుకు నోచుకోకపోవడంతో కార్తిక మాసంలో భక్తులకు స్వామివారి ప్రసాదం కొనుగోలు భారంగా మారింది.