అమెరికాలో ఘనంగా తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమెరికా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19వ తేదీన ఆల్బర్ట్ సి మిల్లర్ పార్క్ వేదికగా నిర్వహించిన మొట్టమొదటి తానా మిడ్-అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ కు అపూర్వ స్పందన లభించింది. ఈ టోర్నమెంట్లో పవర్ బ్లేజెస్ జట్టు ఛాంపియన్ గా నిలవగా, టైటాన్స్ రన్నరప్ గా నిలిచింది. పలువురు క్రీడాకారిణులు ప్రతిభ కనబరిచి వ్యక్తిగత అవార్డులను దక్కించుకున్నారు.