ఓట్ల చోరీపై రేవంత్ రెడ్డి నిప్పులు: బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతూ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన ఓట్ బచావో సభలో ఆయన మాట్లాడుతూ, దేశంలో పేద ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ అక్రమాలపై సుదీర్ఘ పోరాటం కొనసాగుతుందని, బీజేపీ గద్దె దిగే వరకు విశ్రమించమని ఆయన స్పష్టం చేశారు.