ఆదిలాబాద్ మహారాష్ట్ర మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం
రిపోర్టర్: రాము
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా ముకుత్బన్ నుంచి మహారాష్ట్రలోని గడ్చాందూర్ వరకు రూ.493 కోట్ల అంచనా వ్యయంతో 38.21 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికులతో పాటు పారిశ్రామిక సరుకు రవాణా మరింత సులువుకానుండగా, రద్దీగా ఉండే బల్హార్షా నాగ్‌పూర్ నెట్‌వర్క్‌పై భారం తగ్గనుంది.