పాఠశాలలో విద్యార్థినిపై దాడి ఘటన: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై చైన్ రంపంతో జరిగిన అనాగరిక దాడి ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, కూటమి ప్రభుత్వ పాలనలో జంగిల్ రాజ్ నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.