డివైడర్‌ను ఢీకొట్టి వోల్వో కారు దగ్ధం డాక్టర్ మృతి

రిపోర్టర్: అశోక్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట-ఖమ్మం 365 హైవేపై పిల్లలమర్రి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం మమతా హాస్పిటల్ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ సజీవ దహనమయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వోల్వో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ప్రమాద తీవ్రత బయటపడింది. ఈ ఘటన వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.