అరుంధతివాడలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన వైఎస్సార్సీపీ నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
రైల్వేకోడూరు మండలంలోని అరుంధతివాడలో ఎన్నికల ప్రచారం చివరి రోజు వైఎస్సార్సీపీ నాయకులు జోరుగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ గెలుపును అందించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.