పులివెందుల మున్సిపల్ పోలింగ్ కలకలం: ఉద్రిక్తతల మధ్య ప్రశాంతంగా ఓటింగ్
రిపోర్టర్: నరేష్
స్థలం: పులివెందుల
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. అన్ని చోట్లా వెబ్ కాస్టింగ్ జరుగుతోందని, ఇప్పటివరకు యాభై శాతం ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, సాయంత్రం ఐదు వరకు సమయం ఉందని అందరూ ఓటు హక్ కు వినియోగించుకోవాలని కోరారు. మరోవైపు రెండు పార్టీల వర్గాల మధ్య తోపులాటలు జరిగి వాహనాలు దగ్ధం కావడం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.