గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఉప్పు మరియు చక్కెర ముప్పు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఆహార పదార్థాల్లో ఉప్పు, చక్కెర రెండూ కీలకమైనవని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మితిమీరిన ఉప్పు, అదనపు చక్కెర తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి ప్రాణాంతక సమస్యల ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆహారంలో వీటిని మితంగా తీసుకోవాలని, ప్యాకెట్ ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.