హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో వినాయక మండపంలో భారీ అగ్నిప్రమాదం
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జూపిటర్ అపార్ట్మెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సమీపంలో పార్క్ చేసిన రెండు కార్లు, రెండు బైక్‌లు, ఒక సైకిల్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అప్రమత్తమైన స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా దీపం కిందపడటం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.