ఇంటిగ్రేటెడ్ పాఠశాల భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: హరి స్థలం: ఇల్లెందు

ఇల్లెందు నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలంలో చేపడుతున్న సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా సర్వేను త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. భూముల సర్వే ప్రక్రియ వేగవంతం కావడంతో రైతులు తమ పాత పాస్బుక్లను అధికారులకు అందజేశారు.