ముగిసిన 'రణబాలి' షూటింగ్.. విజయ్‌ని హగ్ చేసుకున్న రష్మిక
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' షూటింగ్ పూర్తియింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో రష్మిక విజయ్ను హగ్ చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సెట్లో జయమ్మ పాత్రను మిస్ అవుతున్నట్లు ఆమె తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.