పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెండో పెళ్లి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ తన 52వ ఏట రెండో వివాహం చేసుకున్నారు. ఐరిష్, ఆస్ట్రేలియా నేపథ్యమున్న 62 ఏళ్ల వ్యాపారవేత్త, ఫైనాన్సర్ కామెరూన్ ఓ రీల్లీని ఆమె మనువాడారు. సినిమాలపై ఆసక్తితో పరిచయమైన వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉండి, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2004లో ఇమ్రాన్‌కు విడాకులు ఇచ్చిన జెమీమా, దశాబ్దాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.