గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ఆర్ఎస్టీసీ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.. మణుగూరు బాబుజీ డిమాండ్!
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో పెండింగ్లో ఉన్న నాన్-రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మణుగూరు బాబుజీ డిమాండ్ చేశారు. కొత్తగా మంజూరైన కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పాటు, పాత కేంద్రాలను నిలిపివేయడం వల్ల గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి రెండు నుండి మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని, గిరిజన బిడ్డల విద్యా భవిష్యత్తు కోసం విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి తరగతులు పునరుద్ధరించాలని కోరారు.