వెంకటేష్, త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' టీజర్ అప్‌డేట్ వచ్చేసింది
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' (హౌస్ నంబర్: 47) చిత్రానికి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా అధికారిక టీజర్‌ను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు.