ఉత్తరప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

రోడ్డు ప్రమాద నిందితుడిని పట్టుకుని అప్పగించినా ఎఫ్ఐఆర్లో పేరు చేర్చకపోవడంపై ఉత్తరప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. పోలీసుల పనితీరుపై మండిపడిన జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ ధర్మాసనం, రాష్ట్రంలో అన్ని కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని హెచ్చరించింది. నిందితుడి వివరాలు తెలిసినప్పటికీ ఎఫ్ఐఆర్లో అజ్ఞాత వ్యక్తిగా పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఖుర్జా సర్కిల్ ఆఫీసర్ శోభిత్ కుమార్ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.