రైల్వే ప్రయాణికులకు షాక్: అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయవాడ
విజయవాడ, విశాఖపట్నం డివిజన్ల పరిధిలో అక్టోబర్ 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రాజమహేంద్రవరం, మచిలీపట్నం, గుడివాడ, కాకినాడ పోర్ట్ మార్గాల్లో నడిచే సర్వీసులు నిలిచిపోనున్నాయని తెలిపారు. ప్రయాణికులు ముందే తమ ప్రణాళికలను మార్చుకోవాలని, రైల్వే సమాచార కేంద్రాన్ని సంప్రదించి వివరాలు సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.