ఆర్టీసీ బస్సులో రూ.3 లక్షలు భద్రపరిచి నిజాయితీ చాటిన కండక్టర్
రిపోర్టర్: సురేష్
స్థలం: రంగారెడ్డి
బస్సులో ప్రయాణికుడు మర్చిపోయిన రూ.3 లక్షల నగదును టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులు నిజాయితీగా తిరిగి అప్పగించారు. షాద్‌నగర్‌కు చెందిన జహంగీర్ హజ్ యాత్ర కోసం వెళ్తూ బస్సులో నగదు బ్యాగ్ పోగొట్టుకున్నారు. గుర్తించిన సిబ్బంది ఆ బ్యాగ్‌ను యజమానికి సురక్షితంగా అందజేశారు. ఈ నిజాయితీని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానికులు అభినందించారు.