లక్ష పుష్పార్చనతో యాదగిరిగుట్టలో భక్తిపారవశ్యంతో పులకించిన భక్తజనం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన జరిపారు. వివిధ రకాల సుగంధ పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సహస్రనామార్చన చేపట్టారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో భవాని శంకర్, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.