హైదరాబాద్లో ఘనంగా ‘డెలులు’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో ‘డెలులు’ చిత్ర టీజర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో సంకీర్త్ కొండ నిర్మిస్తున్న ఈ చిత్రం సరికొత్త కథాంశంతో వస్తోందని హీరో విజయ్ రాజ్ కుమార్ తెలిపారు. ఎవరూ సాహసించని కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.