విషాదం: చికిత్స పొందుతూ ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక మృతి
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల బస్సులో ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలపాలైన ఆమె, హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని మంత్రి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.