ఎన్నికల సంఘంపై విమర్శలు తగదంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కృష్ణా జిల్లా

ఓట్లను మూకుమ్మడిగా తొలగించారనేది అపోహ మాత్రమేనని, ఎన్నికల సంఘంపై అనవసరంగా విమర్శలు చేయటం సరికాదని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయాలతో ముడిపెట్టడం తగదని, గెలిస్తే తమ ఘనతగా చెప్పుకోవడం, ఓడితే ఈవీఎంలను నిందించడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రతిష్ఠ మసకబారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన హితవు పలికారు.