క్రీడాస్ఫూర్తితో అట్టహాసంగా ముగిసిన జీఆర్టీఏ ఆరు నెలల క్రికెట్ టోర్నమెంట్
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
జీఆర్టీఏ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడగా, సాడ్లర్ సేన, డెక్కన్ వారియర్స్, టైటాన్స్ జట్లు విజేతలుగా నిలిచాయని పేర్కొన్నారు. క్రీడాకారులు ప్రదర్శించిన అంకితభావం సమాజంలో ఐక్యతను పెంపొందించిందని స్పోర్ట్స్ సెక్రటరీ స్నేహిత్ రెడ్డి వెల్లడించారు. టోర్నమెంట్ను విజయవంతం చేసిన వాలంటీర్లు, నిర్వాహక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.