గంభీరావుపేటలో వినూత్న కార్యక్రమం: పోస్టుకార్డుల ద్వారా పర్యావరణ పరిరక్షణ సందేశాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తూ వినూత్నంగా పోస్టుకార్డ్ మూవ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి సంతోష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ అధికారులకు, సర్పంచ్లకు పోస్టుకార్డుల ద్వారా పర్యావరణ సందేశాలు పంపించారని, నీటిని వృథా చేయకుండా, విద్యుత్ పొదుపు చేయాలని పిలుపునిచ్చారని నిర్వాహకులు పేర్కొన్నారు.