విక్రమ్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్' మూవీ ప్రకటన!

రిపోర్టర్: రాజేష్ స్థలం: తమిళనాడు

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి 'పవర్ హౌస్' అనే టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై నిర్మాణం జరుగుతోంది. తాజాగా విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.