బురదమయంగా మారిన కాలనీ రహదారులతో స్థానికుల అవస్థలు

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయ వెనుక కాలనీలో కురిసిన వర్షాల కారణంగా రోడ్లు పూర్తిగా బురదమయంగా మారాయి. దీనివల్ల కాలనీవాసులు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, త్వరితగతిన రోడ్లను బాగుచేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.