గణేష్ నిమజ్జనాలను చీకటి పడేలోపు ముగించాలని ఎస్పీ సూచన

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: కాకినాడ

తుఫాను ప్రభావం దృష్ట్యా రానున్న రెండు రోజుల పాటు గణేష్ నిమజ్జన కార్యక్రమాలను సాయంత్రం చీకటి పడేలోపు పూర్తి చేసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఉత్సవ కమిటీలు నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.