బెల్లంపల్లిలో కులమతాలకు అతీతంగా అన్నదానం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ వేణుగోపాలస్వామి ఆలయంలో కులమతాలకు అతీతంగా సోదరభావాన్ని చాటుతూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ముక్తార్, ఖలీల్ ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. హిందూ ముస్లిం అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పరస్పర సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.