ఏలేశ్వరంలో రోడ్లపై చేరిన వర్షపు నీటిని తొలగించిన సిబ్బంది

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: ఏలేశ్వరం

ఏలేశ్వరం పట్టణంలోని షిర్డీ నగర్ రోడ్డుపై గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా చేరిన నీటిని మున్సిపాలిటీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు గురువారం ఉదయం తొలగించారు. సాధారణ రోజుల్లోనూ డ్రైనేజీలను శుభ్రం చేస్తే ఈ సమస్య రాదని స్థానికులు పేర్కొన్నారు. వర్షపు నీరు రోడ్లపై చేరకుండా మురుగు కాలువల సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.