ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సవాల్: దేశద్రోహి ఎవరో బహిరంగంగా చర్చిద్దామంటూ ఫైర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సవాల్ విసిరారు. ప్రతిపక్షాలను దేశద్రోహులుగా అభివర్ణిస్తున్న తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశద్రోహి ఎవరో, విదేశీ శక్తులతో ఎవరికి సంబంధాలు ఉన్నాయో తేల్చుకునేందుకు ఎక్కడైనా, ఏ వేదికపైనైనా తనతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. భయపడకుండా తక్షణమే ఈ చర్చకు ముందుకు రావాలని ప్రధాని మోదీని ఆయన సూటిగా నిలదీశారు.