గాడిద పేరు మీద నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ

రిపోర్టర్: రాము స్థలం: Bhopal

మధ్యప్రదేశ్ నర్సెస్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ పోర్టల్ లోపాలు బట్టబయలయ్యాయని ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి పర్మార్ వెల్లడించారు. కౌన్సిల్ ఆన్లైన్ పనితీరును పరీక్షించేందుకు ఆయన ఏకంగా ఒక గాడిద ఫోటో మరియు తండ్రి పేరు స్థానంలో గాడిద తండ్రి అని నమోదు చేసి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఎలాంటి సరైన ధ్రువపత్రాల పరిశీలన చేయకుండానే కౌన్సిల్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ గాడిద పేరు మీద ప్రొవిజనల్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేసిందని ఆయన తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు.