నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎస్బీఐలో డెబ్బై ఏడు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ వివిధ విభాగాలలో డెబ్బై ఏడు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నట్లు బ్యాంక్ మేనేజ్మెంట్ వెల్లడించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ ఇరవై ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు ఉంటుందని అధికారులు తెలిపారు.