రఘునాథపాలెం బీసీ గురుకులంలో విషాదం.. ఆటలాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి!

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రఘునాథపాలెం

రఘునాథపాలెం మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆటలాడుతుండగా ఎనిమిదో తరగతి విద్యార్థి సాత్విక్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు మృతి చెందినట్లు సమాచారం. గుండెపోటు కారణంగానే సాత్విక్ మృతి చెంది ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుడు తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన హరీశ్, ప్రియాంక దంపతుల కుమారుడు కావడం గమనార్హం. ఈ ఆకస్మిక ఘటనతో పాఠశాలలో మరియు స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.