సముద్రగర్భంలో భారీగా బంగారం, వెండి నిక్షేపాలు కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు
రిపోర్టర్: మహేష్
స్థలం: World
పశ్చిమ పసిఫిక్ సముద్రంలో భారీ స్థాయిలో బంగారం, వెండి ఖనిజ నిక్షేపాలను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రపు అడుగుభాగంలో హైడ్రోథర్మల్ ఫీల్డ్‌లో ఈ విలువైన లోహాలు అసాధారణంగా ఉన్నట్లు తేలింది. భూమిపై లభించే వాటితో పోలిస్తే ఇక్కడ సాంద్రత గణనీయంగా ఎక్కువగా ఉంది. రాగి, ఇనుము, జింక్ వంటి కీలక ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.