నటి అమీషా పటేల్ ఇంట్లో భారీ చోరీ, మేడ్ అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మహారాష్ట్ర

బాలీవుడ్ నటి అమీషా పటేల్ ముంబై నివాసంలో రూ. 5 లక్షల విలువైన వజ్రాల బంగారు గాజు చోరీకి గురైంది. ఇంట్లో పనిచేస్తున్న సీమా ఘాటే ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు, ఆమెను విరార్ ప్రాంతంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితురాలను పోలీసు కస్టడీకి అనుమతించింది.