ఇచ్ఛాపురాన్ని పారిశ్రామిక హబ్‌గా మారుస్తాం: మంత్రి రామ్మోహన్ నాయుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. మూలపేట పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతాన్ని వాణిజ్య, పారిశ్రామిక హబ్‌గా మారుస్తామని, తద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. రహదారులు, రైల్వే స్టేషన్ ఆధునీకరణతో ఉత్తరాంధ్ర సరిహద్దు ప్రాంతాన్ని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.