'సమస్య పరిష్కరించకపోతే మళ్లీ కుక్కలను వదిలేస్తాం': యువసేన నేత హెచ్చరిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర పంచాయతీ కార్యాలయంలో వీధికుక్కల బెడదపై యువసేన జిల్లా చీఫ్ విక్రమ్ రంధవే వినూత్న నిరసన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆయన చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భమ్రే ఛాంబర్‌లోకి నేరుగా కొన్ని కుక్కలను వదిలారు. అంతేకాకుండా అధికారుల తీరుకు నిరసనగా కరెన్సీ నోట్లతో కూడిన దండలను బల్లపై ఉంచారు. వీధికుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో మళ్లీ ఇదే రీతిలో నిరసన చేపడతామని ఆయన హెచ్చరించడంతో స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.